top of page

Acerca de

Feedback

English

Tamil

Hindi

మహర్షి గోశాల, వరంగల్ లో వర్మతెరపి అద్భుత సంఘటన:
ఆరు నెలల క్రితం మహర్షి గోశాలలో 2 రోజులపాటు వర్మ తెరపి గురువుగారు శ్రీ రమేష్ బాబు గారిచే మన వైద్య మిత్రులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ రోజు సాయంత్రం,  గోశాలలో సేవ చేసుకుంటున్న మాటలు రాని వీణ అనే ఆమెకు మాటలు వచ్చేటట్టు చికిత్స చేయమని కోరడం జరిగింది. ఆమె వయసు 45 సంవత్సరాలు. ఆమెకు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల వాయిస్ పోయింది. ఏమైనా అడిగితే సైగలు చేసి లేదా పేపర్ మీద రాసి సమాధానం చెప్పేది. గొంతు ఆపరేషనుకు లక్ష రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. అయినా  మాట వస్తుందని గ్యారెంటీ లేదన్నారు.  ఆమె ఒంటరి మహిళ. అందువలన ఆమెను గో సేవ చేసుకుంటూ గోశాలలోనే ఉండమని ఒక రూమ్ ఇచ్చాము. ఇది ఆమె చరిత్ర. శ్రీ రమేష్ బాబు గురువుగారు రెండవ రోజు శిక్షణ ముగిసిన తర్వాత రాత్రి ఆమెకు గోశాలలో వర్మ తెరిపి చేశారు. గొంతు భాగంలో ఉండే కొన్ని పాయింట్స్ నొక్కిపట్టి  అప్పటికప్పుడే మాట్లాడేటట్టు చేశారు. నొక్కడం వదిలివేయగానే మళ్లీ మాట పోయింది. ఈ విధంగా ప్రయత్నాలు చేసి ఆమెకు కొన్ని వర్మ పాయింట్స్ చెప్పి కొన్ని బీజాక్షరాలు నేర్పించి రోజు ప్రాక్టీస్ చేయమన్నారు. 15 రోజుల్లో మాట వస్తుందన్నారు. వారు చెప్పినట్టుగానే ఆమెకు  మాట వచ్చింది. ఇప్పుడు ఆమె గోశాలలో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం చేస్తున్నారు.
ఇంతటి అద్భుతమైన ప్రాచీన కళను అంతరించిపోకుండా కాపాడుతూ మన వైద్య మిత్రులకు నేర్పిస్తున్న శ్రీ రమేష్ బాబు గురువు గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను.

warangal ramesh_edited.jpg

Sarjan Ramesh
Maharshi Goshala - Warangal
Herbal medicine for Cancer
https://www.maharshigoshala.in

Telugu

Let’s Work Together

Get in touch so we can start working together.

  • Facebook
  • Twitter
  • LinkedIn
  • Instagram
Thanks for submitting!
bottom of page